హిందూ సామ్రాజ్యం పేరుతో మోడీ ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారు – చాడ వెంకట్ రెడ్డి

-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సమాధుల వద్ద పూలమాలలువేసి నివాళులర్పించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజా సమస్యల పరిస్కారం కోసం సమర శీల పోరాటానికి సిపిఐ సన్నద్ధం అవుతుందన్నారు.

హిందూ సామ్రాజ్యం పేరుతో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు వెంకట్ రెడ్డి. రియలటర్లు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో, రాష్టంలో పార్టీ జెండాలు మారినా.. పేదల బతుకులు మాత్రం మారలేదన్నారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజు నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం పల్లేపల్లెకు సిపిఐ కార్యక్రమం చేపడతామన్నారు.

భూమి, భూక్తి, విముక్తి కోసం నాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిందని.. నాటి పోరాటల ఫలితంగానే తెలంగాణ సిద్దించింది కానీ.. వీరుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మహమ్మదాపూర్ గుట్టల ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేద్దుందుకు కృషి చేస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news