కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. తాజాగా సోమవారం కమిషన్ ఎదుట విజిలెన్స్ డీజీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విజిలెన్స్ విచాణపై ఆనంద్ పీసీ ఘోష్ కు వివరించారు. ఇవాళ విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాల గురించి కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీశారు. అదనపు సమాచారం ఇవ్వడంతో పాటు తుది నివేదిక కూడా త్వరగా ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషన్ ఆదేశించారు. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన కమిషన్ త్వరలోనే ప్రభుత్వం మాజీ పెద్దలను విచారించేందుకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలోనే విజిలెన్స్ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం నుంచి జస్టిస్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇదివరకే అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని విచారించేందుకు సిద్ధం అవుతుంది. బుధవారం మాజీ ఈఎన్సీ మురళీధర్ ను ప్రశ్నించనుంది.