తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు…దశాబ్దాల కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు…అలాగే పలుమార్లు విజయాలు అందుకున్నారు. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.
1989 నుంచి ఆందోల్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. తర్వాత 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి పోటీ చేసిన బాబూమోహన్ చేతిలో దామోదర ఓటమి పాలయ్యారు. అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా మళ్ళీ కష్టపడి..2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే గత రెండు ఎన్నికల్లో ఆయనకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఆందోల్ లో టీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది.
కానీ ఈ సారి ఆందోల్లో టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపించడం లేదు…అదే సమయంలో ఇటు దామోదరకు కూడా ఛాన్స్ తక్కువగా ఉంది. వాస్తవానికి రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి దామోదరపై ఉంది. అయితే మరోవైపు బీజేపీ పుంజుకోవడం మైనస్ అవుతుంది. మామూలుగా ఉంటే ఈ సారి టీఆర్ఎస్ పై దామోదర పైచేయి సాధించేవారు…కానీ అనూహ్యంగా బీజేపీ పికప్ అవుతూ రావడం దామోదరకు ఇబ్బంది అవుతుంది.
పైగా ఆందోల్ లో బీజేపీ తరుపున మాజీ మంత్రి బాబూమోహన్ పనిచేస్తున్నారు…గతంలో ఈయన టీడీపీలో పనిచేసి…2014లో ముందు టీఆర్ఎస్ లో చేరి ఆందోల్ బరిలో గెలిచారు. 2018లో ఈయనకు సీటు రాలేదు..దీంతో బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఆందోల్ లో టీఆర్ఎస్ తరుపున క్రాంతి కిరణ్ దాదాపు 17 వేల ఓట్ల మెజారిటీతో దామోదరపై గెలిచారు.
అయితే ఇప్పుడు క్రాంతికి ఆందోల్ లో పెద్ద పాజిటివ్ లేదు…దామోదర బలం పెరుగుతూ వస్తుంది. కాకపోతే బీజేపీ ఇంకా పుజుకుంటే నెక్స్ట్ కూడా దామోదర గెలుపుకు ఇబ్బంది అయ్యేలా ఉంది.