హైదరాబాద్ లో ఐపీఎల్ ఆడనివ్వం : దానం నాగేందర్

సన్‌రైజర్స్‌ టీమ్‌లోకి హైదరాబాద్‌ క్రీడాకారులను తీసుకోకపోతే హైదరాబాద్ లో జరిగే అన్ని  మ్యాచ్‌లను అడ్డుకుంటామని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హెచ్చరించారు. ఒకవేళ ఐపీఎల్ జట్లు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్‌ ఆడాలంటే…హైదరాబాద్‌ ప్లేయర్స్‌ను తీసుకోవాల్సిందేనన్నారు. లేనిపక్షంలో సన్‌ రైజర్స్‌ పేరును అయినా మార్చుకోవాలని ఆయన అన్నారు.

లేదంటే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ మ్యాచులను అడ్డుకుంటామని దానం నాగేందర్‌ హెచ్చరించారు.  ఐపీఎల్ వేలంలో హైదరాబాద్‌ నుంచి ఒక్క ప్లేయర్‌ ని కూడా ఎంపికచేయకపోవడం మీద ఆయన ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో అద్భుతమైన ఆటగాళ్లున్నా కావాలనే పక్కనపెట్టారని మండి పడ్డారు. ఇప్పటి కైనా హైదరాబాద్‌ ప్లేయర్లను ఎంపిక చేయాలని లేదా ఎస్‌ఆర్‌హెచ్‌ తన టీం పేరును మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారుఅన్నారు. ఇక ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.