తమిళ హీరో ధనుష్ కు ప్రతిష్టాత్మక అవార్డ్… బ్రిక్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఉత్తమ నటుడిగా…

-

తమిళ హీరో, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ ను మరో అవార్డ్ వరించింది. గోవాలోని పనాజీలో జరుగుతున్న 52 వ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్(IFFI) లో ఈ అవార్డ్ అనౌన్స్ చేశారు. బ్రిక్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లో ఉత్తమ నటుడిగా ధనుష్ కు అవార్డ్ వరించింది. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంతో రూపొందించిన ’అసురన్‘ సినిమాలో చేసిన ఫర్ఫామెన్స్ కు గానూ ధనుష్ కు ఈ అవార్డ్ వరించింది. ధనుష్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఇదే చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాలు సభ్యులుగా ఉంటాయి.

ధనుష్ ఉత్తమ నటుడిగా ఎంపిక చేయగా బ్రెజిలియన్ చిత్రం ‘ఆన్ వీల్స్’లో తన నటనకు లారా బోల్డోరిని ఫెస్టివల్‌లో ఉత్తమ నటి (మహిళ) అవార్డును అందుకుంది. ఉత్తమ చిత్రం అవార్డును దక్షిణాఫ్రికా చిత్రం ‘బరకత్’, రష్యన్ చిత్రం ‘ది సన్ అబౌ మీ నెవర్ సెట్స్’ అనే రెండు చిత్రాలు పంచుకున్నాయి. ‘బరకత్’ చిత్రానికి అమీ జెఫ్తా దర్శకత్వం వహించగా, రష్యన్ చిత్రానికి లియుబోవ్ బోరిసోవా దర్శకత్వం వహించారు. ఈ ఉత్సవంలో చైనీస్ దర్శకుడు యాన్ హాన్ తన ‘ఎ లిటిల్ రెడ్ ఫ్లవర్’ చిత్రానికి ప్రత్యేక అవార్డును అందుకున్నారు. IFFIతో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే తొలిసారి. బ్రిక్స్ ఫెస్టివల్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా సినిమాలు పాల్గొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news