ఇటీవల నారాయణ కాలేజీలో ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అంతేకాకుండా.. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న అరాచకాలు మరోసారి ఈ విధంగా బయటపడ్డాయి. అయితే దీనిపై బీజేపీ నాయకుడు దాసోజ్ శ్రవణ్ స్పందిస్తూ.. కార్పొరేట్ కాలేజీలకు కేసీఆర్ కుటుంబం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. నారాయణ కాలేజీ ఘటనలో గాయపడ్డ విద్యార్థి నాయకులు సందీప్, వెంకటేశ్ చారిలను అపోలో హాస్పిటల్ లో ఆయన పరామర్శించారు దాసోజ్ శ్రవణ్. అనంతరం వారికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ… విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లే కార్పొరేట్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ లేకుండా పోయిందన్నారు.
విద్యార్థులకు మేలు చేయాల్సిందిపోయి… కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలను ప్రసన్నం చేసుకునే పనిలో విద్యా శాఖ అధికారులున్నారని ఫైర్ అయ్యారు దాసోజ్ శ్రవణ్. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే ప్రైవేట్ కాలేజీలు ఇష్టమొచ్చినట్లు ఫీజులు పెంచుతున్నాయని మండిపడ్డారు దాసోజ్ శ్రవణ్. కాలేజీ ఫీజుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలన్నారు. నారాయణ కాలేజీ ఘటనలో గాయపడ్డ సందీప్, వెంకటేశ్ చారిలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దాసోజ్ శ్రవణ్.