Breaking : మూసిలో గుర్తుతెలియని మృతదేహం

-

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ వెనుక భాగంలోని మూసిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.

మూసిలో ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఎక్కడనుండైనా కొట్టుకొని వచ్చింది.. లేక ఎవరైనా చంపి పడేసారా లేక సూసైడ్ చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో మూసిలో ఇది నాల్గవ మృతదేహం లభ్యమవడం ఆందోళన కలిగించే విషయం. ఒకటి ఆసిఫ్ నగర్ పోలీస్ లిమిట్స్ లో దొరకగా మరో రెండు మృతదేహాలు కులుసుంపురలో లిమిట్స్ లో దొరికాయి, లంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మృతదేహంతో రెండవది కావడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version