పిల్లాడయిన నిక్కీ ఆనందంగా ఉన్నాడు.పిల్లది అయిన ప్రియాంక అను పిల్లా కూడా ఆనందంగానే ఉండాలి.అద్దె గర్భం తో ఈ చిన్ని ప్రపంచంలోకి యువరాజు నిక్కీ జోనస్ వచ్చాడు.విన్నంత మేరకు వీరికి ప్రేమ బాగా కలిసివచ్చిందని నిర్థారించుకోవాలి. ఇంతకాలం పింకీ చోప్స్ ప్రేమ మరింత బలపడి మరింత స్థిరపడిపోయిందని రాసుకోవాలి. బిడ్డలు లోకం చూశాక పెద్దలు మరింత శ్రద్ధ పెంచుకోవాలి.గ్లామర్ రంగంలో ఉండే ప్రియాంకను గారాలు పోయిన యువరాజు ఏ విధంగా మారుస్తాడో..
పెళ్లి చేసుకోవడంలో ఉన్న ఆనందం కన్నాపిల్లలను కనే ఆనందం చాలా ఎక్కువ ఉండాలి. ఉంటుంది కూడా! గారాల ప్రియాంక ఆ ఆనందాన్ని పెద్దగా అనుభవించకుండానే అద్దె గర్భం ద్వారా తన తరువాతి తరంను భూమ్మీదకు పరిచయం చేసింది.అమ్మతనం ఇక్కడి నుంచి ఆమెలో ఏ విధంగా స్రవించనుందో ప్రేమ ఏ విధంగా ప్రసరించనుందో అన్న ఆసక్తి కూడా భలే ఉంది అందరిలో!
ప్రియాంకకు ప్రేమించే గుణం ఉంది.. మరి! ప్రియాంకను ప్రేమించే వారి గుణం ఏం కావాలి.. వారాంతం వీటి గురించే ఆలోచిస్తే అదృష్టవంతుడు అయిన నిక్కీ ఆమె పెదవి కొరికి కొన్ని ఆనందాలు ఇచ్చి వెళ్లాడు.. ఆమెకు మరియు ఇంకొందరికి కూడా!
చిన్న చేతులతో ప్రపంచాన్ని పలకరిస్తున్న యువ రాజు కూడా ప్రేమకు ప్రతినిధి ఇకపై కూడా అలరించాలని కోరుకోవడం మనందరి కనీస బాధ్యత.
ఆఖరుగా..సెలబ్రిటీలకు ప్రేమ లేఖలు రాయడంలో ఉన్న ఆనందం.వారు ఓ తల్లి గానో తండ్రిగానో హోదా పొందాక కలగదు. దేవుడు కొంత ఆయుష్షును వాళ్లకు అదనంగా ఇచ్చాక మనకు ఇంకొంత సంతోషం అనే సంపదని పంచాలి. కానీ పింకీ చోప్స్ ఇప్పుడు ఓ పిల్లాడి తల్లి.. ఓ విధంగా తండ్రి కూడా! ఇప్పుడు ఆమెను ఎలా చూడాలి .ఆమె ఇప్పటి నుంచి నడిచే విధానం ఎలా ఉండాలి. వీటిపై కూడా వీకెండ్ ఓ డిస్కషన్ ఎక్కడో ఏదో ఓ చోట నడుస్తూనే ఉంటుంది కనుక.. ఆనందంగా వాటిని కూడా వింటూ మరో పింకీ చోప్స్ ఎక్కడుందో బ్రహ్మదారులు వెతుక్కుంటే మేలు అని అనిపిస్తోంది ఇవాళ.
View this post on Instagram
– ఛాయా చిత్ర కథంబం, మన లోకం ప్రత్యేకం