బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే ఈరోజు తన 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది అయితే అమాయకంగా కనిపిస్తూనే ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కనిపించే ఈ తార కోసం కొన్ని ఆసక్తికర విషయాలు…
దీపికపదుకునే డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో 1986 జనవరి 5న జన్మించారు.. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకుణె. తల్లి ఉజ్వల ట్రావెల్ ఏజంట్.
దీపిక చిన్నప్పుడు తండ్రి బాటలో నడిచి బ్యాడ్మింటన్ ఎంచుకుంది. రాష్ట్రస్థాయిలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే హై స్కూల్లో చదువుతున్నప్పుడే పలు ప్రకటనల్లో నటించింది..
ఆ తర్వాత మోడలింగ్ ను ఎంచుకొని మొదటిసారి 2003లో ర్యాంప్ వాక్ చేసింది.. అలా కెరీర్ను మొదలుపెట్టి పలు యాడ్స్ లో అవకాశాలు సంపాదించుకుంది ఇలా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.. అలాగే ఈ సమయంలోనే కింగ్ ఫిషర్ స్విమ్ సూట్ క్యాలెండర్ పై కూడా మెరిసారు..
మొదటగా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ భామ హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో కలిసిన ఆ సినిమా పలు కారణాలతో వాయిదా పడగా ఆ తర్వాత ఓం శాంతి ఓం చిత్రంలో మళ్లీ షారుక్ పక్కనే కనిపించింది.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవటంతో తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి..
దీపికా పదుకొనే ఓ మనిషి రైటర్ కూడా.. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు 2009లో పలు వ్యాసాలు కూడా రాశారు..
మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. లివ్ లాఫ్ లైఫ్ అనే సంస్థ ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అలాగే జీవితంలో ఒకానొక పరిస్థితుల్లో డిప్రెషన్కు గురయ్యానని పలుమార్లు చెప్పుకొచ్చారు అయితే దాన్నుంచి బయటపడి ఇప్పటికి పలువురికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు..
అలాగే కొన్నాళ్లు రణ్వీర్తో ప్రేమలో మునిగి తేలిన దీపికా 2018లో అతన్ని పెళ్లి చేసుకున్నారు..