రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 161 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా బ్యాటర్లలో శ్రీకర్ భరత్ డకౌట్ కాగా… రిషబ్ పంత్ 13 పరుగులతో ధాటిగా ఆడాడు.. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, యుజ్వేంద్ర చాహాల్ తలో వికెట్ తీశారు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్లు అశ్విన్ 50 పరుగులు, దేవదత్ పడిక్కల్ 48 పరుగులతో రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల చేసింది. రాజస్థాన్ మిగతా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ 19 పరుగులు, జోస్ బట్లర్ 7 పరుగులు, సంజూ శాంసన్ 6 పరుగులు, రియాన్ పరాగ్ 9 పరుగులు, డస్సెన్ 12 పరుగులు ట్రెంట్ బౌల్డ్ 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఆన్రిచ్ నార్జ్, మిచెల్ మార్ష్ తలో వికెట్లు పడగొట్టారు. అయితే.. ఢిల్లీ గెలవడం కారణంగా.. హైదరాబాద్ ప్లే ఆఫ్ బర్త్ కఠినంగా మారింది.