ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే,అనారోగ్య కారణాలు దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును కేజ్రీవాల్ ఇటీవల ఆశ్రయించగా.. జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే.. మరో వారం రోజుల పాటు తనకు బెయిల్ గడువును పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు.
దీనికి సంబంధించి అర్వింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరో వారంపాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అత్యవసర పిటిషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.జస్టిస్ JK మహేశ్వరి, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం.. అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్ పై తదుపరి ఆదేశాల కోసం.. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ తెలిపింది.