ఇష్టం లేని శృంగారం నేరమే.. హైకోర్టు సంచలన తీర్పు

-

ఇష్టం లేని శృంగారంపై ఢిల్లీ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లయినా.. కాకున్నా… ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని ఢిల్లీ హై కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన… ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా అని ప్రశ్నించింది హై కోర్టు.

వివాహితు, అవివాహితల గౌరవాన్ని వేరు వేరు గా చూడలేమని స్పష్టం చేసింది కోర్టు. పెళ్లయినా.. కాకున్నా… ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని ఢిల్లీ హై కోర్టు స్పష్టం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకని పురుషులు మెలగాలని పేర్కొంది.

పెళ్లయినంత మాత్రన… భర్త బలవంతంగా శృంగార చర్యకు పాల్పడినా.. మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా ? ఐపీసీ 375 సెక్షన్‌ ఆ కేసులో వర్తించదా ? ఇది సరికాదు… అని కోర్టు పేర్కొంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా అని ప్రశ్నించింది.

ఐపీసీ 375 సెక్షన్‌ పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని అధికరణం-14, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ధర్మసనానికి ఉందని తెలిపింది. 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్న సంగతిని గుర్తు చేసింది.”ఓ మహిళ నెలసరిలో ఉన్నప్పుడు.. భర్తతో శృంగారలో పాల్గొనేందుకు ప్రయత్నించినప్పుడు మహిళ నిరాకరించినా… అది నేరమే.. కానీ లైంగిక చట్టం పరిధిలోకి రాదు ” అని హైకోర్టు పేర్కొంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version