Breaking : ఈ నెల 22న ఢిల్లీ మేయర్ ఎన్నిక

-

ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈ నెల 22న నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనాను సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన వెల్లడించారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని ప్రజాస్వామ్య విజయంగా కేజ్రీవాల్‌ అభివర్ణించారు. ” నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. రెండున్నర నెలల తర్వాత ఢిల్లీకి మేయర్‌ రానున్నారు. ఢిల్లీలో ఎల్జీ, బీజేపీ నిత్యం చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తున్నాయని కోర్టులో రుజువైంది” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కాగా ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించగా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు విషయంలో బీజేపీ, ఆప్ ల మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది. మోజారిటీ ప్రకారం మేయర్ సీటును ఆప్ దక్కించుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news