మరీ ఇంత దారుణమా….ఏపీలో ప్రజాస్వామ్యం లేదా…

-

తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం లేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.యథేచ్ఛగా బెదిరింపులకు, భౌతిక దాడులకు తెగబడుతున్నారు.ఏపీలో ఏదో ఒక మూల ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ కార్యకర్త పాలేటి రాజ్ కుమార్ ని టీడీపీ నేతలు చుట్టుముట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు.దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే….పాలేటి రాజ్ కుమార్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు.అతని బట్టలు ఊడదీసి, నడిరోడ్డుపై కూర్చోబెట్టి చిత్రహింసలు పెట్టారు. మోకాళ్లపై నిలబెట్టి మరీ దాడికి పాల్పడ్డారు. చివరకు చేతులెత్తి లోకేష్ కి మొక్కేలా, క్షమాపణలు చెప్పేలా చేశారు. కాళ్లు పట్టుకుంటాను వదిలేయమని వేడుకున్నా కనికరించలేదు. లోకేష్ ఫ్లెక్సీ ముందు వైసీపీ కార్యకర్తని మోకాళ్లపై నిలపెట్టి, నడిరోడ్డులో టీడీపీ నేతలు ఆరాచకాన్ని సాగించారు.మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ తరపున యాక్టివ్ గా ఉండేవారు రాజ్ కుమార్ దంపతులు. నేరుగా జగన్ ని కలసి కూడా ఫొటోలు దిగారు. మంగళగిరిలో లోకేష్ కి వ్యతిరేకంగా పనిచేశారు. సోషల్ మీడియాలో కూడా పాలేటి కృష్ణవేణి పలు పోస్టింగ్ లు పెట్టేవారు. అప్పటినుంచే ఈ దంపతులపై టీడీపీ నేతలు రగిలిపోయేవారు. తీరా ఫలితాలు వచ్చాక ఇదిగో ఇలా ప్రతాపం చూపించారు. పాలేటి రాజ్ కుమార్ ని పట్టుకుని చిత్రహింసలు పెట్టారు.

రాజ్ కుమార్ పై జరిగిన అమానవీయ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడటంలేదని చెప్పిన చంద్రబాబు.. ఈ దాడులను ఎంతవరకు సమర్థిస్తారో చూడాలి అని వైసీపీ నేతలు అంటున్నారు.రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నారు.ఎన్నికలకు ముందునుంచే పోలీసులు టీడీపీకి వంతపాడుతున్నారని, వైసీపీని టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు.వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version