డేంజర్ డెంగ్యూ…9 రాష్ట్రాలకు సెంట్రల్ టీమ్స్

-

ఇండియాలో ఓవైపు కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని సంతోషపడుతుంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సెంట్రల్ మెడికల్ టీమ్స్ ను పంపిస్తోంది. వ్యాధి నియంత్రణ, నివారణ, వ్యాప్తిని తగ్గించేలా సెంట్రల్ మెడికల్ టీములు తగిన చర్యలు తీసుకోనున్నాయి. సోమవారం దేశంలో డెంగ్యూపై అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మండవ్యా ఆదేశాల మేరకు కేంద్ర టీములు నేడు రాష్ట్రాలకు వెళ్లాయి. ముఖ్యంగా 9 రాష్ట్రాల్లో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో హర్యానా, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ ఉన్నాయి.dengue fever

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,16,991 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఈ 9 రాష్ట్రాలు, యూటీల్లోనే 86 శాతం కేసుల నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. దేశంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన కేసుల కన్నా ఈ ఏడాది ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

డెంగ్యూ, కోవిడ్ లో ఏది అనేది ఈ లక్షణాల ద్వారా గుర్తించచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news