డెంగ్యూ, కోవిడ్ లో ఏది అనేది ఈ లక్షణాల ద్వారా గుర్తించచ్చు..!

కరోనా మహమ్మారి కారణంగా మనం ఎంతగానో సతమతమవుతున్నాము. అయితే ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇంకా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపో లేదు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే డెంగ్యూ కేసులు కూడా ఎక్కువ భారతదేశంలో నమోదవుతున్నాయి. చాలా మంది ప్రజలు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. చాలా మందిలో చూసుకున్నట్లయితే కరోనా మరియు డెంగ్యూ లక్షణాలు కనబడుతున్నాయి అని డాక్టర్లు గుర్తించారు. ఇది నిజంగా ప్రాణాంతకం అని డాక్టర్లు చెప్పడం జరిగింది.

covid-dengue
covid-dengue

అయితే ఈ రెండిటినీ మనం పరిగణలోకి తీసుకొని ఏ సమస్యతో బాధ పడుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి వలన ఏ సమస్య వచ్చిందో ప్రజలు గుర్తించలేక పోతున్నారు. డెంగ్యూ వచ్చిందా లేదా కరోనా వచ్చిందా అని తెలియట్లేదు. అయితే డాక్టర్లు ఈ లక్షణాల ద్వారా ఏ సమస్య వచ్చింది అనేది గుర్తించవచ్చని చెప్పారు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

కరోనా మరియు డెంగ్యూని ఎలా గుర్తించాలి….?

కరోనా కనుక వచ్చిందంటే వాసన తెలియదు. అలానే రుచి కూడా తెలియదు. కానీ డెంగ్యూ అలా కాదు.
అలానే డెంగ్యూ వచ్చిందంటే డయేరియా చాలా సాధారణంగా వస్తుంది. అదే కరోనా అయితే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తుంది అని తెలుసుకోండి. జ్వరం, పొడిదగ్గు, అలసిపోవడం, గొంతు నొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, చెస్ట్ పెయిన్ కరోనా వలన వస్తాయి. అయితే డెంగ్యూ యొక్క సివియారిటీని బట్టి జ్వరం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లాంటివి వస్తాయి.

మైల్డ్ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు

మైల్డ్ డెంగ్యూ ఫీవర్ కనుక వచ్చిందంటే మోకాళ్ళ నొప్పులు, తీవ్రమైన జ్వరం, ఒంటి మీద ర్యాషెస్, వాంతులు, తలనొప్పి వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

డెంగ్యూ హెమోర్ర్హగిసీ జ్వరానికి లక్షణాలు

దంతాల నుండి రక్తం కారడం, ముక్కు నోటి నుండి రక్తం కారడం, బ్లడ్ ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం, ఇంటర్నల్ బ్లీడింగ్, డయేరియా, చర్మం పైన బ్లడ్ స్పాట్స్, కడుపు నొప్పి దీనికి లక్షణాలు.

డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లక్షణాలు

డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. బీపీ, అలసిపోవడం, నీరసం, విజువల్ లేదా ఆడిటరీ హాలూసినేషన్స్, హెవీ బ్లీడింగ్, హై ఫీవర్, వాంతులు, కడుపునొప్పి మొదలైనవి వస్తాయి.

ఏది ఏమైనా డెంగ్యూ తో బాధపడే వాళ్ళు హైడ్రేట్ గా ఉండాలి. ఒకవేళ కనుక బాగా ఇబ్బందిగా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అదే కరోనా వచ్చింది అంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్క్ ధరించడం మర్చిపోకండి. అలానే వైద్యులని సంప్రదించి సరైన చికిత్స తీసుకుని సురక్షితంగా వుండండి.