ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ మొదలైంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అరెస్టులతో, నిరసనాలతో రాష్ట్రం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ‘శస్త్ర చికిత్స జరిగిందని దారిలో గుర్తించారంట. అయినా తెల్లవార్లు తిప్పి 24 గంటల తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అచ్చన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అక్రమ అరెస్ట్ చేసారు. నేర స్వభావికి అధికారమిస్తే ఇంతేనని చంద్రబాబు గారు, ప్రజలు అంటుంది నిజమేకదా చెప్పండి జగన్ గారూ’ అని ట్వీట్ చేసారు.
శస్త్రచికిత్స జరిగిందని దారిలో గుర్తించారంట అయినా తెల్లవార్లుతిప్పుడే 24గంటల తరువాత ఆసుపత్రికి. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అచ్చన్న,జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్ రెడ్డి ల అక్రమఅరెస్ట్. నేరస్వభావికి అధికారమిస్తే ఇంతేనని @ncbn గారు, ప్రజలు అంటుంది నిజమేకదా చెప్పండి @ysjagan గారు pic.twitter.com/ZnAsuVsyvg
— Devineni Uma (@DevineniUma) June 14, 2020
అలాగే ఏపీలో రాజకీయపార్టీలతో సంబంధంలేని వారు కూడా కష్టపడి వ్యాపారంచేసి సంపాదించిన సొమ్ములో కొంతభాగాన్ని జే టాక్స్ రూపంలో కప్పంకట్టాల్సిన పరిస్థితులు కల్పించారు ఈపరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయోనని ఊహించడానికే భయపడుతున్న ప్రజలకు సమాధానంచెప్పండి జగన్ గారూ’ అంటూ మండిపడ్డారు.
ఏపీలో రాజకీయపార్టీలతో సంబంధంలేని వారు కూడా కష్టపడి వ్యాపారంచేసి సంపాదించిన సొమ్ములో కొంతభాగాన్ని జే టాక్స్ రూపంలో కప్పంకట్టాల్సిన పరిస్థితులు కల్పించారు ఈపరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయోనని ఊహించడానికే భయపడుతున్న ప్రజలకు సమాధానంచెప్పండి @ysjagan గారు#APSuffersUnderJagan pic.twitter.com/XWTYsaoIy9
— Devineni Uma (@DevineniUma) June 14, 2020