మావోయిస్టు రహిత రాష్ట్రం కోసం కృషి చేస్తున్నాం : డీజీపీ మహేందర్‌ రెడ్డి

-

ములుగు జిల్లా ఏజెన్సీలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నేడు పర్యటించారు. వెంకటాపురం మండలం ఆలుబాకలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందలన్నా.. పెట్టు బడులు రావాలన్నా.. నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలన్నారు. తెలంగాణ – చత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికల వివరాలు ఆరా తీశారు డీజీపీ మహేందర్ రెడ్డి. మావోయిస్టు రహిత రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు నిఘా పెంచామని చెప్పారు డీజీపీ మహేందర్ రెడ్డి.

Impersonators target Telangana DGP on WhatsApp

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు . అదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు గోదావరి తీరం వెంట నిఘా ముమ్మరం చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ప్రజల భాగస్వామ్యంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాల తో నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news