ధనుశ్ ‘సార్‌’ నుంచి ఫస్ట్‌ సింగల్‌కు టైం ఫిక్స్‌

-

సితార నాగవంశీ – త్రివిక్రమ్ దర్శకత్వంలో ధనుశ్ సినిమా ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఒక వైపున తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తెలుగులో నేరుగా సినిమా చేసే ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. అయితే అందుకు సమయం ఉండటంతో, వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా ఫాస్టుగా ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్లింది. సితార నాగవంశీ – త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రేపు ఈ సినిమా నుంచి ‘మాస్టారు … మాస్టారు’ అంటూ సాగే ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్వేత మోహన్ ఆలపించింది. ‘సార్’ సినిమాకి తమిళంలో ‘వాతి’ అనే టైటిల్ ను సెట్ చేశారు.సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సముద్రఖని .. సాయికుమార్ .. ఆడుకాలం నరేన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version