అరవింద్ రివర్స్..కొత్త స్ట్రాటజీనా?

-

నిత్యం కేసీఆర్ పై ఫైర్ అయ్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు ధర్మపురి అరవింద్ సడన్ గా రివర్స్ అయ్యారు…ఇప్పటివరకు కేసీఆర్ పై విరుచుకుపడిన అరవింద్…ఇకపై కేసీఆర్ ని తిట్టనని చెప్పుకొచ్చారు. రాజకీయ విభేదాలే తప్ప…కేసీఆర్ పై వ్యక్తిగత కక్ష ఏమి లేదని అన్నారు. ఇకపై కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడనని అన్నారు. బీజేపీకి గ్రాఫ్ పెరుగుతుందని, అదే సమయంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, దీంతో కేసీఆర్ మానసిక పరిస్తితి రోజురోజుకూ దిగజారుతోందని అన్నారు. ఏదేమైనా ఇక నుంచి కేసీఆర్ పై పరుష పదజాలం వాడకుండా ఉండటానికి చూస్తానని చెప్పారు.

అయితే ఎప్పుడు కేసీఆర్ పై విరుచుకుపడే అరవింద్..సడన్ గా ఇలా మాట్లాడటం వెనుక ఏదో కారణం ఉందని విశ్లేషకులు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి అంశం ఒక స్ట్రాటజీనే అని…ఇప్పటివరకు కేసీఆర్ పై విరుచుకుపడటం ఒక స్ట్రాటజీ అయితే…ఇప్పుడు తిట్టను అని చెప్పడం వెనుక కూడా ఏదో స్ట్రాటజీ ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు.

కానీ రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి తప్ప…బూతులు తిట్టుకోవడం ఉండకూడదు…కానీ కేసీఆర్ తో సహ టీఆర్ఎస్ నేతలు…ఇటు కౌంటర్ గా బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం బూతులతోనే తిట్టుకుంటున్నారు. ఎవరికి తగ్గ బాషలో వారికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి అరవింద్ సైతం అదే తరహాలో మాట్లాడుతూ వచ్చారు.

కానీ సడన్ గా ఆయన తిట్టను అని చెబుతున్నారు. అంటే ఇలా తిట్టడం వల్ల బీజేపీకి పెద్దగా బెనిఫిట్ రాకపోగా, కేసీఆర్ పై సానుభూతి పెరుగుతుదనే కోణం కూడా ఉన్నట్లు ఉంది..పైగా అరవింద్ పై టీఆర్ఎస్ శ్రేణుల దాడులు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల మేరకే అరవింద్ పరుష పదజాలం వాడనని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ గాని, టీఆర్ఎస్ నేతలు గాని తిడితే…అరవింద్ అదే తరహాలో కౌంటర్ ఇవ్వకుండా ఉంటారో లేదో చూడాలి. మొత్తానికైతే అరవింద్ మాటలు వెనుక ఏదో స్ట్రాటజీ ఉన్నట్లే కనిపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news