గ‌ప్టిల్ బ్యాటింగ్ చేశాక 4.4 కేజీలు త‌గ్గాడా?

-

టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ టోర్న‌మెంట్ లో భాగంగా బుధ వారం న్యూజిలాండ్ ప‌సికూన అయిన స్కాట్లాండ్ ను ఢీ కొట్టింది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ పై న్యూజి లాండ్ 17 ప‌రుగుల తేడా తో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ విర విహారం చేశాడు. కేవ‌లం 56 బంతుల్లోనే 93 ప‌రుగులు సాధించాడు.

అయితే ఈ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన త‌ర్వాత డ్రెస్సింగ్ రూం లోకి వెళ్లి గ‌ప్టిల్ బ‌రుపు చెక్ చేసుకుంటే దాదాపు 4.4 కిలో గ్రాములు త‌గ్గ‌డ‌ట‌. ఈ విష‌యాన్ని మార్టిన్ గ‌ప్టిల్ యే స్వ‌యం గా తెలిపాడు. అయితే యూఏఈ వాత‌వర‌ణాన్ని ఆట‌గాళ్లు అంత త్వ‌ర‌గా అల‌వాటు చేసు కోవ‌డం లేదు. అక్క‌డ ప్ర‌స్తుతం ఎండలు విప‌రీతం గా కొడుతున్నాయి. దీని తో ఆట‌గాళ్లు డీ హైడ్రేష‌న్ కు గురి అవుతున్నారు. అలాగే యూఏఈ లో ఉన్న ఉష్ణోగ్ర‌త‌లు, తేమ వ‌ల్ల ఆట‌గాళ్లు త్వ‌ర‌గా అల‌సి పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version