వ్యాయాయం చేయడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. వ్యాయాయం చేయడం వలన మనసుకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే సడెన్ గా వ్యాయాయం చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆవు ఏంటో ఒక్కసారి చూద్దామా.
అయితే ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తూ మంచి ఫిట్ నెస్ కలిగి ఉన్న వారు సడన్ గా వ్యాయామం చేయడం మానేస్తే.. సుమారు 12 వారాల తర్వాత, మీ ఫిట్‌నెస్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతాయి. తద్వారా మీ శరీరాకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాయామం చేసే సమయంలో మీ శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆ సమయంలో పొట్ట కూడా తగ్గుతుంది.
అంతేకాదు.. ఎప్పుడైతే వ్యాయామం మానేస్తామో అప్పుడు పొట్ట మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మీకు కేవలం వారం రోజుల్లోనే కనిపిస్తుంది. మీ శరీరంలోని కొవ్వును కరిగించలేరు కాబట్టి మీరు నెమ్మదిగా మళ్లీ బొద్దుగా తయారవుతారు. తద్వారా మీ జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది, ఫలితంగా బరువు పెరుగుతారు.
వ్యాయామం మానేసిన వెంటనే మీ రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మీరు వ్యాయామం మానేసిన సమయంలో మీ రక్తపోటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. అదే రెండు వారాల తరువాత, మీ రక్త నాళాలు నిశ్చల జీవనశైలికి అనుగుణంగా మారిపోతాయి. సడన్ గా వ్యాయామం మానేస్తే శ్యాస సమస్యలు అధికమవుతాయి. మీరు కొద్ది దూరం నడిచినా, పరిగెత్తినా సరే వెంటనే అలసట చెందుతారు. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మీ ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే మీ కండరాలకు పనిచెప్పక పోవడమే.
ఇక మీ రోజువారి వ్యాయామాన్ని సడన్ గా ఆపేయడం వలన మీ మెదడు త్వరగా అలసిపోతుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీనివల్ల మనసు ఆహ్లాదంగా మారుతుంది. నిరాశ, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అంతేకాక, మీ మానసిక స్థితిని మెరుగుపర్చుకోవచ్చు.
అయితే సడన్ గా వ్యాయామం మానేస్తే మీ కండరాలు బలహీనపడతాయి. తద్వారా క్రమంగా మీ కండరాలు పటుత్వం కోల్పోతాయి. కొన్ని రోజుల్లో మీరు బరువులెత్తే సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. రోజూ వ్యాయామం చేసే సమయంలో మీరు వంద కేజీల బరువును సులువుగా ఎత్తగలిగితే వ్యాయామం ఆపేసిన కొన్ని రోజుల తర్వాత అందులో సగం బరువును ఎత్తేందుకు కూడా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి కండరాల పటుత్వం తగ్గడమే కారణం అని నిపుణులు చెబుతున్నారు.