మనుసులో కోరిక బయటపెట్టిన దీపికా పదుకొణే… జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలంటూ..

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే.. ఈ బ్యూటీని తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని స్టార్ హీరోలంతా భావిస్తుంటారు. బాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల నుంచి కూడా ఆఫర్లు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఆసక్తిగా చూస్తున్న సినిమా ‘గెహ్రైయాన్’ రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ సినిమావిడుదలకు సిద్దంగా ఉంది. ఈచిత్ర ప్రమోషన్లలో పాల్గొటుంది దీపిక.

ఇదిలా ఉంటే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సూపర్ అన్సర్ ఇచ్చింది దీపికా.. మీరు ఏ స్టార్ తో ఇప్పటి వరకు వర్క్ చేయలేదు.. అవకాశం వస్తే ఎవరితో పని చేసేందుకు సిద్దంగా ఉన్నారంటూ.. అడిగాడు. తన అభిమాని అడిగిన ఈ ప్రశ్నకు దీపికా జూనియర్ ఎన్టీఆర్ పేరును చెప్పింది. జూనియర్ అద్భుతమైన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చింది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలా సంతోషిస్తానని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపుతున్నాయి. దీాంతో బాలీవుడ్ హీరోయిన్లు కూడా సౌత్ స్టార్స్ తో నటించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరోవైపు గెహ్రైయిన్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది దీపికా పదుకొణే. ఈసినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండేలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈసినిమాలో దీపికా పలు రొమాంటిక్ లిప్ లాక్ లు, బెడ్ రూం సీన్లలో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news