ఈ రోజు ఎన్నో అంచనాల మధ్యన థియేటర్ లలో విడుదలైన మూవీ ఖుషి. ఇందులో విజయ్ దేవరకొండ మరియు సమంతలు విప్లవ్ మరియు ఆరాధ్యల పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా మంచి సక్సెస్ ఫుల్ టాక్ తో అన్ని చోట్ల రన్ అవుతోంది. కాగా ఈ సినిమాలో సీన్ కు సరిగ్గా సూట్ అయ్యే విధంగా రెండు చోట్ల సమంత మరియు విజయ్ దేవరకొండ ల మధ్యన లిప్ లాక్ కిస్ ను పెట్టడం జరిగింది, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం వంటి కొన్ని ఎమోషనల్ అటాచ్మెంట్ వలన ఖచ్చితంగా ప్రేక్షకులకు నిజమైన జంట అని ఫీలింగ్ కలిగేలా లిప్ లాక్ సీన్ లను చేశాము అంటూ వివరించారు.
విజయ్ దేవరకొండ సమంత ల లిప్ లాక్ పై డైరెక్టర్ క్లారిటీ !
-