దర్శకుడు గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి.. వధువుగా మారబోతున్న కూతురు..!!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల ఇంట జరిగే పెళ్లి శుభకార్యాలు లేదా మరి ఏదైనా శుభకార్యాల అయినా సరే చాలా సందడిగా సాగుతూ ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా పెళ్లి వేడుకలు అయితే కన్నుల విందుగా ఉంటుంది. ముఖ్యంగా మన సంస్కృతి ప్రకారం పెళ్లి అనేది అత్యంత వైభవమైన వేడుక.. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత పీట వేసి.. అంగరంగ వైభవంగా తమ కొడుకు , కూతుర్ల పెళ్లి జరపాలని తల్లిదండ్రులు ఎంతగానో కలలు కంటారు. సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతున్నాయి అంటే మిగతా సెలబ్రిటీలు కూడా ఆ పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఉంటారు.

ఇక సినీ ప్రముఖుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు క్రేజ్ ఎక్కువ.. ఎందుకంటే తమ అభిమాన హీరోలందరూ ఒకే చోట కలిసి మాట్లాడుకుంటుంటే కన్నుల విందుగా ఉంటుంది . ఇక తాజాగా ఈ అపురూప ఘట్టం త్వరలోనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట చూడబోతున్నాము. ఇక ఆయన కూతురు పెళ్లి చేసుకోబోతున్నారు. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణశేఖర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈమె త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా కాబోయే వరుడితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. హైదరాబాదులోని ఒక ఫంక్షన్ హాల్ లో రవి ప్రఖ్యాతో నీలిమా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

నిశ్చితార్థ వేడుకలు ముగిసిన తర్వాత తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో నీలిమ ఒక పోస్టు కూడా పెట్టారు. నా జీవితకాల ప్రయాణం మొదలైంది అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన నేటిజన్స్ అందరూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. నీలిమ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రుద్రమదేవి సినిమాకు సహనిర్మాతగా పనిచేసిన నీలిమ.. ఇప్పుడు తన తండ్రి దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇటు వృత్తిపరంగా అటు వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ పొందాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news