డైరెక్టర్ త్రివిక్రమ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. మొదటిసారిగా ఇండస్ట్రీలోకి రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు, అత్తారింటికి దారేది, జులాయి, అరవింద సమేత, అల వైకుంఠపురం చిత్రాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాయి. అలా వైకుంఠపురం సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ .
ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో తన భార్య సౌజన్య గురించి తెలియజేశారు. తన భార్యను ఇప్పటివరకు ఎలాంటి సినిమా సెట్ కి తీసుకు వెళ్లలేదని తెలిపారు. మొదటిసారిగా అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్ కోసం ప్యారిస్ కి వెళ్ళాము అని తెలిపారు. కానీ అక్కడ కేవలం రెండు రోజులు మాత్రమే తన భార్య ఉండడం జరిగిందని తెలియజేశారు. ఇక తన భార్య సౌజన్య అక్కడి క్లైమేట్, అడ్జస్ట్ కాకపోవడంతో నీరసించి పోయింది అని తెలియజేశారు. దాంతో అతని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసానని తెలిపారు.
ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌజన్య ను 2002 లో వివాహం చేసుకున్నారట. ఈమె ఒక క్లాసికల్ డాన్సర్. ఇక ఈమె వేసిన ఒక క్లాసికల్ డాన్స్ పర్ఫామెన్స్ కి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇక ఈమె సినీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి స్వయానా మేనకోడలు అవుతుంది. ఇంతటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఈమె ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో పద్ధతిగా ఉంటుంది. ఇక ఈమె చేసే క్లాసికల్ డాన్స్ షో లు విదేశాలలో కూడా ఇస్తూ ఉంటుందట.