త్రివిక్రమ్‌ కోసం వెయిట్‌ చేస్తోన్న స్టార్ హీరోలు…!

-

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నెక్ట్స్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తారక్‌ ట్రిపుల్‌ ఆర్ నుంచి వచ్చే లోపు చిన్న సినిమా తీస్తాడని అని ఒకసారి, భారీ ప్రాజెక్ట్‌ అని మరోసారి ఇలా బోల్డన్ని కాంబినేషన్స్‌ వినిపిస్తున్నాయి. అసలు త్రివిక్రమ్‌ నెక్ట్స్‌ ఎవరితో సినిమా చేస్తాడు, ఈ దర్శకుడి నెక్ట్స్‌ మూవీ ఎప్పుడు సెట్స్‌కి వెళ్తుంది?

త్రివిక్రమ్‌ నెక్ట్స్‌ మూవీపై ఇప్పటికి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. జూ.ఎన్టీఆర్‌తో సినిమా అనౌన్స్‌ చేసిన త్రివిక్రమ్‌ 2020లోనే తారక్‌ సినిమా స్టార్ట్ చెయ్యాలనుకున్నారు కానీ “ఆర్ ఆర్ ఆర్’ వాయిదాతో ప్లాన్ మొత్తం మారిపోయింది. కరోనా లాక్‌డౌన్‌తో “ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్స్ మార్పులు చేర్పులతో త్రివిక్రమ్ మూవీ హోల్డ్ లో పడింది. ఈ గ్యాప్ లో కథలు రాసుకుంటోన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం స్టార్ హీరోలు ఎదురుచూసున్నారట. మెగా ఫ్యామిలీ నుంచి పవన్,బన్నీ త్రివిక్రమ్ కథ కోసం ఎగ్జైటింగ్ ఎదురుచూసున్నారట. వీరితోపాటు హీరో రామ్ కోసం ఓ ప్రాజెక్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట ఈ మాటల మాంత్రికుడు.

Read more RELATED
Recommended to you

Latest news