రాత్రిపూట వీటిని అస్సలు తినద్దు…!

-

చాలామంది ఆహారం విషయంలో ఎటువంటి నియమాలని కూడా పాటించరు. వారికి నచ్చినట్లుగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నచ్చినట్టు ఆహారాన్ని తీసుకోవడం వలన పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు రాత్రి డిన్నర్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలని అనుసరించాలి.

లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రిపూట అసలు వీటిని తీసుకోకండి. అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక మరి ఎటువంటి ఆహార పదార్థాలకు రాత్రిపూట దూరంగా ఉండాలి అనేది చూసేద్దాం.

కాఫీ:

కాఫీ ని రాత్రిపూట అసలు తీసుకోకూడదు చాలా మంది రాత్రి పూట కాఫీని తాగుతారు ఇది అనారోగ్యకరమైన అలవాటు అని గుర్తు పెట్టుకోండి. ఇది మీ జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది. అలానే మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

ఆపిల్:

రాత్రిపూట ఆపిల్ తీసుకుంటే ఎసిడిటీ పెరిగిపోతుంది పగటిపూట తీసుకుంటే అరుగుదల బాగుంటుంది కాబట్టి ఈ తప్పుని అసలు చేయొద్దు.

అరటిపండు:

రాత్రిపూట అరటిపండును తీసుకోవద్దు పగలు తీసుకుంటే శక్తి వస్తుంది కానీ రాత్రి తీసుకుంటే దగ్గు జలుబు వంటి సమస్యలు కలుగుతాయి.

గ్రీన్ టీ:

ఉదయాన్నే గ్రీన్ టీ ని తీసుకోవడం వలన డిహైడ్రేషన్ ఎసిడిటీ వంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

అన్నం:

అన్నాన్ని రాత్రి పూట తీసుకోకండి అన్నంలో పిండి పదార్థం ఎక్కువ దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది అరుగుదల సమస్య బరువు పెరిగే ప్రమాదం ఇవన్నీ కూడా అన్నం వలన కలుగుతాయి.

పెరుగు:

రాత్రిపూట పెరుగు తీసుకోవడం వలన ఎసిడిటీ పెరుగుతుంది. శ్వాస మార్గం పై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి పెరుగు ని కూడా రాత్రిళ్ళు తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news