వారి ఉచ్చులో పడకండి: ప్రధాని మోడీ

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు విష రాజకీయాలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పడొద్దని సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ అభివృద్ధి, సామాజిక భద్రత, సామాజిక న్యాయానికి తోడ్పాటును అందిస్తోందని, ఈ ఎనిమిదేళ్లలో దేశ ప్రజలకు బీజేపీపై భరోసా పెరిగిందని అన్నారు. శుక్రవారం జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.

ప్రధాని మోడీ
ప్రధాని మోడీ

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే ప్రజలకు పార్టీపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం ప్రారంభించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోనుందన్నారు. సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు బీజేపీ అంటే విశ్వాసం ఏర్పడిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news