పొరపాటున కూడా ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి..ఇస్తే మర్చిపోవాల్సిందే..

-

మానవ జీవితంలో డబ్బులు చాలా విలువైనవి.. డబ్బే జీవితాన్ని నడిపించే యంత్రం..డబ్బులు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం…కొంత మంది అప్పులు చేసి రికవరీ చేస్తారు. అదే సమయంలో కొంత మంది అప్పులపాలై చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఇతరులకు ఇచ్చిన సొంత డబ్బు అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్ ను ఊహించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి…

అత్యవసర పరిస్థితి అయినా కూడా డబ్బులను బుధవారం అప్పుగా ఇవ్వకూడదు..ఈ రోజు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదని నమ్ముతారు. బుధవారం గణేశుడిని పూజించాల్సిన రోజు.. వినాయకుడు శుభ లాభాలకు అధినాయకుడు. బుధవారం నాడు అప్పు ఇవ్వకపోవడానికి కారణం ఇదే.. ఇలా చేయడం వలన గణపతికి కోపం వస్తుందని విశ్వాసం.

అదే విధంగా మంగళవారం కూడా ఈ రోజున రుణం తీసుకోవడం వల్ల డబ్బు నష్టం, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ రోజు తీసుకున్న రుణం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. అయితే తిరిగి చెల్లించిన రుణం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజున రుణం తీసుకోవడం పురాణాల గ్రంథాల్లో నిషేధించబడింది. ఈ రోజు రుణం తీసుకోకుండా పాత రుణం ఉంటే తిరిగి చెల్లించాలి..

అమావాస్య నాడు అప్పు ఇవ్వకూడదు. అమావాస్య రోజున ప్రతికూల శక్తులు చురుకుగా ఉంటాయని నమ్మకం. దీంతో ఈ రోజున ఇచ్చిన అప్పు మీ సంపదపై కూడా ప్రభావితం చూపుతుందని విశ్వాసం..జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది..భద్ర కాలాన్ని అశుభ సమయంగా పరిగణిస్తారు. ఇది విభేదాలు, గొడవలను సృష్టిస్తుంది. ఈ సమయంలో డబ్బు లావాదేవీలు డబ్బు సంపాదించడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.. మనుషుల మధ్య బంధాన్ని పాటు చేస్తుంది.. ఇవి గుర్తు పెట్టుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version