ఇటువంటి లైఫ్ పార్ట్నర్ అస్సలు వద్దు..!

-

అందరి తీరు, ప్రవర్తన ఒకే లాగ ఉండదు. ఒక్కొక్కరి తీరు , ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలాగ ఉంటాయి. అయితే నిజంగా కాస్త కఠినంగా ఉండే వాళ్ళని, కొంచెం వెరైటీగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కష్టాలు చూడాలి. అయితే నిజంగా జీవితంలో వివాహం అనేది ఒక గొప్ప అనుభూతి. వివాహంతో రెండు కుటుంబాలు ఏకం అవుతాయి. ఎంతో ఆనందంగా అంతా ఉంటారు. అదే ఒకవేళ కనుక వివాహం లో ఇబ్బందులు వస్తే రెండు కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళని అస్సలు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.

life patner | లైఫ్ పార్ట్నర్
life patner | లైఫ్ పార్ట్నర్

స్వేచ్ఛ లేకపోవడం:

మీ జీవితంలో వచ్చే వ్యక్తి మీ నిర్ణయాలను గౌరవించాలి. అదే విధంగా మీకు కాస్త స్వేచ్ఛనివ్వాలి అలా ఇవ్వకుండా ఉండే స్వభావం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకపోవడం మంచిది.

షేర్ చేసుకోకుండా ఉండడం:

మీ జీవితంలో కష్టాలు ఉన్నా ఆనందాలు ఉన్నా మీతో కలిసి పంచుకునే వారు అయి ఉండాలి. ఒకవేళ కనుక అలా పంచుకోని వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే మీరు జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ప్రేమగా చూసుకోవడం:

పెళ్లి అయిపోయిన తర్వాత చాలా మంది పార్ట్నర్స్ అస్సలు పట్టించుకోరు. అలా అస్సలు ఉండకూడదు. ఎంతో ప్రేమగా మిమ్మల్ని, పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండాలి.

ఎడ్జస్ట్ అవ్వకుండా ఉండటం:

చాలా మంది ప్రతి దానిలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏమాత్రం ఎడ్జస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి ఎత్తిచూపుతూ ఉంటారు. అటువంటి వారిని భాగస్వామిగా ఎంచుకోవడం నిజంగా పెద్ద తప్పు.

నెగిటివ్ గా ఆలోచించడం:

పాజిటివ్ గా ఆలోచించకుండా ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉండే వ్యక్తులతో జీవితాన్ని పంచుకోవడం దండగ.

Read more RELATED
Recommended to you

Latest news