కొన్ని కొన్ని సార్లు మనకు చాలా నీరసంగా, బద్దకంగా ఉంటుంది. అటువంటి సమయంలో పనులు చేసుకోవడం కూడా అవ్వదు. అయితే నీరసం, బద్ధకం లాంటివి లేకుండా రోజంతా కూడా యాక్టివ్ గా ఉండాలంటే ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఆ వాస్తు చిట్కాల గురించి చూసేద్దాం.
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం:
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం అనేది చాలా మంచి అలవాటు. ప్రతిరోజు యోగా లేదా వ్యాయామ పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అదే విధంగా మంచి నిద్రని కూడా పొందొచ్చు. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయండి.
నీళ్లు ఎక్కువగా తాగండి:
నీళ్లు ఎక్కువ తాగడం కూడా చాలా అవసరం. కనీసం రోజుకి మూడు లీటర్లు నీళ్లు తాగడం మంచిది ఇలా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు. అలానే నీరసం, బద్ధకం, వీక్నెస్ లాంటి ఇబ్బందులు కూడా రావు. అలానే నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లేదా ఫ్రూట్ జ్యూస్లని కూడా తీసుకోవచ్చు.
మంచిగా నిద్ర పోవడం:
సరిగ్గా నిద్రపోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. నిద్రపోవడానికి కొంచెం సేపు ముందు మెడిటేషన్ చేస్తే బాగా నిద్ర పడుతుంది. అలాగే రిలాక్స్ గా ఉండొచ్చు.
సరైన ఆహారం తీసుకోవడం:
డైట్ లో సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పోషక పదార్థాలను తీసుకుంటూ ఉండండి. తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదేవిధంగా ఏ సమస్య లేకుండా ఉండొచ్చు.