ఈ ట్రెండింగ్‌ పదాల గురించి మీకు తెలిసిందా..?

-

మనలో ఉండే కొన్ని అలవాట్లను ఇంగ్లీష్‌లో ఏమంటారో కూడా మనకు తెలియదు. టెక్నాలజీ దూసుకెళ్తుంది. షార్ట్‌కట్‌లో అసలైన పదాలకు వేరే పదాలు జోడించి మాట్లడడం ఈ జనరేషన్‌ వాళ్లకు బాగా అలవాటైంది. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో కొత్త ఆంగ్లపదాలను ప్రతిఏడాది చేర్చుతున్నారు. మరి వాటిల్లో కనీసం కొన్నైనా మనకు తెలియాలి కదా..! అలా 2022లో ట్రెండింగ్‌లో ఉన్న 10 ఆంగ్ల పదాలు మీకోసం..
ఆస్సమోసాస్ (AWESOMESAUCE):
అద్భుతమైనది. అని చెప్పే అర్ధంలో దీన్ని వాడుతున్నారు.
నోమో ఫోబియా (Normophobia):
మొబైల్ ఫోన్ లేకుండా, దానికి దూరంగా ఉండలేమనే భయాన్ని కలిగి ఉండటాన్ని నోమా ఫోబియా అనే పదం వాడుతుంటారు.
పేరెంట్ (SHARENT)
ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారానే తమ పిల్లలతో సమాచారం పంచుకొనే వారిని షేరెంట్ అంటున్నారు. షేర్ + పేరెంట్ = షేరెంట్ ఏర్పడిందన్నమాట.
సిచ్యు‌యేషన్‌షిప్ (SITUATIONSHIP):
ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మిత్రులకు ఎక్కువ, దంపతులకు తక్కువ అని చెప్పేందుకు ఈ పదం వాడుకలో ఉంది.
ఫిన్ ఫ్లూయెన్నైర్ (FINFLUENCER)
డబ్బు సంబంధిత అంశాలపై దృష్టి సారించేలా ప్రభావితం చేసే వ్యక్తిని ఫిన్‌ఫ్లూయెన్సెర్‌గా పేర్కొంటున్నారు.
ఫిట్‌స్పిరేషన్ (FITSPIRATION)
ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకొనే విషయంలో ప్రేరణగా నిలిచే వ్యక్తి లేదా వస్తువులను “గురించి చెప్పేటప్పుడు ఫిట్‌స్పిరేషన్ పదాన్ని వాడుతున్నారు. సిటిసిస్, ఇన్‌స్పిరేషన్ పదాల కలయికతో ఫిట్‌స్పిరేషన్ ఏర్పడింది.
స్థాన్ (STAN):
ఎవరైనా సెలబ్రిటీ పట్ల అత్యుత్సాహం/ అమితంగా ఆరాధించే స్వభావం కలిగిన వ్యక్తిని స్టాన్‌గా పేర్కొంటున్నారు. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది కదా..!
లో-కి (LOW-KEY);
ఏదైనా ఒక విషయం ఇతరులకు స్పష్టంగా తెలియకూడదని చెప్పే క్రమంలో విశేషణంగా ఈ పదాన్ని వాడతారు. అలాగే, తమ గురించి ప్రగల్భాలు చెప్పుకోవడం ఇష్టంలేని వారి గురించి చెప్పేటప్పుడు కూడా ఈ పదాన్ని వాడుతుంటారు.
హ్యాంగ్రీ (HANGRY):
బాగా ఆకలి వేయడం ద్వారా మనలో కలిగే కోపం, చిరాకు గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని వాడతారు.
మెటావర్స్ (METAVERSE):
మెటావర్స్ అనేది ఒక వర్చువల్ పద్ధతి. దీనిద్వారా ‘ కంప్యూటర్లో యూజర్లంతా వర్చువల్‌గా కలుసుకుని, డిజిటల్ అవతార్‌లతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version