బరువు తగ్గాలని జీలకర్ర నీరు తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసా..?

-

చాలామంది పొట్ట తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా.. మొదట చేసేది.. జీలకర్ర వాటర్ తాగడమే.. మనకు తెలిసిన వాళ్లు కూడా ఇదే చెప్తుంటారు. కానీ రిజల్ట్ అందరికీ ఒకేలా ఉండదు. దీంతో మనకు అసలు ఈ జీలకర్ర వల్ల ఎలాంటి లాభం లేదు.. తాగడం వేస్ట్ అనుకుంటారు. బరువు తగ్గించే గుణాలు జీలకర్రలో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జీలకర్రలో క్రిమినాశక గుణాలు ఎక్కువగా ఉన్నాయని, ఇది గాయాలు లేదా వాపులను త్వరగా మాన్పుతుందని వైద్యులు అంటున్నారు. మరి మనకు ఎందుకు జీలకర్ర వాటర్ తాగినా ఫలితం ఉండటం లేదనే కదా మీ డౌట్.. తాగమన్నారు కదా అని మనకు తెలిసినట్లు తాగేయడం కాదు.. జీలకర్ర వాటర్ తాగే వాళ్లు ఈ విషయాలు పక్కగా తెలుసుకోవాలి.. అవేంటంటే..

బరువు తగ్గడంలో జీలకర్ర పాత్రేంటి

శరీరంలో బరువు పెరగడం వల్ల వీపు వైపు వాపు ఏర్పడుతుంది. అయితే.. జీలకర్ర నీరు శరీరం నుంచి వీటిని తొలగించడానికి పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గే సమయంలో, జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం

జీలకర్ర నీరు తాగడానికి సరైన మార్గం

చాలా మంది జీలకర్ర నీటిని తప్పుడు మార్గంలో తాగుతారు.. అందుకే వారు ఆశించిన ఫలితాలు పొందలేరు.రాత్రిపూట జీలకర్రను నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని వేడి చేసుకొని తాగాలి. జీలకర్రను ఈ విధంగా ఉపయోగించడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మనలో చాలామంది.. పొద్దన్న లేచిన తర్వాత.. కొంచెం జీలకర్ర తీసుకుని వాటర్ లో వేసుకుని మరగబెట్టి తాగుతుంటారు.. అలా కాకుండా పైన చెప్పినట్లు రాత్రంతా నానపెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సమ్మర్ లో తాగకపోవడమే బెటర్

జీలకర్ర నీరు వేడి చేస్తుంది. దీని కారణంగా ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవి కాలంలో దీనిని తాగడం మానేయాలి. ఏప్రిల్-జూన్ మధ్య తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.. అయితే ఒకవేళ తాగాలనుకుంటే.. గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం మంచిది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news