మీకు కంప్యూటర్ పై నాలెడ్జ్ ఉందా? ఈ జాబ్స్ మీ కోసమే..

-

కంప్యూటర్ పై గ్రిప్ ఉన్న వాళ్ళకు అదిరిపొయె గుడ్ న్యూస్..కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆధారిత ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సీ-డ్యాక్ కాంట్రాక్టు ప్రాతిపదికన 650 కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆధారిత ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఈ 2022 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు మొత్తం ఖాళీలు 650 ఉన్నాయని నోటిఫికేషన్ పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌ cdac.in లో వివిధ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 20, 2022. అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా ఇంటర్వ్యూ తేదీ తెలియజేస్తారు కాబట్టి ఎప్పుడూ వాడే యాక్టివ్ ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.పోస్టులు బట్టి అభ్యర్థులు B.E లేదా B.Tech లేదా M.E లేదా M.Tech/ Ph.D డిగ్రీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి పోస్ట్‌కు ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఫారాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సీ-డ్యాక్ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ఎలాంటి అప్లికేషన్ ఫీజు తీసుకోవడం లేదు. అభ్యర్థులు https://careers.cdac.in/advt-details/CORP-3062022-8K54U లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకొవాలి..

*. అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ cdac.inకి వెళ్లాలి.

*. హోమ్‌పేజీలో టాప్ రైట్ కార్నర్‌లో కనిపిస్తున్న మెనూపై క్లిక్ చేసి కెరీర్స్‌ (Careers)పై క్లిక్ చేయాలి. తరువాత కరెంట్ జాబ్ ఆపర్చునిటీస్‌ (Current Job Opportunities) పై నొక్కి కరెంట్ ఓపెనింగ్స్‌ (Current Openings)పై క్లిక్ చేయాలి.

*. ఆ పేజీలో “C-DAC వివిధ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది (C-DAC Invites online applications for Various Contractual….)” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

*. ఇప్పుడు ఒక కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. కాస్త కిందికి స్క్రోల్ చేస్తే జాబ్ డీటెయిల్స్ (Job Details) అనే సెక్షన్ కింద అన్ని పోస్ట్‌ల పేర్లు.. వాటికి కుడివైపు మూలలో అప్లికేషన్ లింక్స్‌ కనిపిస్తాయి

*. మీరు దరఖాస్తు చేయదలచుకున్న పోస్ట్‌కి సంబంధించిన ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

*. CDAC వెబ్‌సైట్‌లో మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌ ఉపయోగించి అభ్యర్థి పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి

*. అప్లికేషన్ ఫారాన్ని నింపాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి.

*. ఫారాన్ని సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి.

అప్లికేషన్లను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు..

అఫీసియల్ వెబ్‌సైట్‌లో ప్రతి పోస్ట్‌కు అవసరమైన అర్హతలు, అర్హత ప్రమాణాలను పేర్కొంది. వీటిని అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోవడం మేలు..

Read more RELATED
Recommended to you

Latest news