జిడ్డు జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

-

ఆయిలీ జుట్టు తెగ ఇబ్బంది పెడుతుంటుంది. ఎన్నిసార్లు తలస్నానం చేసినా కూడా దానివల్ల వచ్చే ఇబ్బంది తొలగిపోకుండా ఉంటుంది. ఆయిలీ జుట్టు పరిష్కారం కోసం మార్కెట్లో చాలా సాధనాలు ఉన్నాయి. అవి ఖరీదుతో కూడుకున్నవి ఉంటాయి. అందుకే ఆయిలీ జుట్టు సమస్యతో బాధపడుతూ, జీవం లేని వెంట్రుకలతో ఇబ్బంది పడుతుంటే గనక ఈ ఇంటిచిట్కాలు పాటించవచ్చు. దీనివల్ల ఆయిలీ జుట్టు సమస్య నుండి బయటపడవచ్చు. జిడ్డు జుట్టుతో బాధపడేవారు తయారు చేయాల్సిన ఫేస్ ప్యాకుల గురించి తెలుసుకుందాం.

ఓట్ మీల్ ప్యాక్

కావాల్సిన పదార్థాలు

ఓట్ మీల్- ఒక కప్పు
మంచినీళ్ళు- రెండు కప్పులు
కలబంద రసం- 1టేబుల్ స్పూన్

నానబెట్టిన ఓట్ మీల్స్ తీసుకుని వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దానికి కొంత కలబంద రసాన్ని, నీళ్ళని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలస్నానం చేసుకోవడానికి 45నిమిషాల ముందు తలకి పట్టించాలి. మాస్క్ లాగా తలకి పెట్టుకుంటే బాగుంటుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.

కాఫీ టోనర్

కావాల్సిన పదార్థాలు

కాఫీ పౌడర్- 5స్పూన్లు
మంచినీళ్ళు- ఒక గ్లాసు
గ్లిసరిన్- 1టేబుల్ స్పూన్

పద్దతి

నీళ్ళలో కాఫీ పౌడర్ ని నానబెట్టి, 5నిమిషాల పాటు ఉడికించాలి. ఆ కాఫీ పౌడర్ బాగా మరిగిన తర్వాత దానిలో గ్లిసరిన్ కలపాలి. ఆ తర్వాత దాన్ని 3-4 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. మీకు కావాల్సినపుడు( దాదాపు తరచుగా) జుట్టుకి స్ప్రే చేసుకోవాలి. దీనివల్ల అయిల్ ఉత్పత్తి అవకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version