మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

-

నిద్ర లేకపోతే.. మనిషి అస్సలు యాక్టివ్‌గా పనిచేయలేడు.. రోజులో కనీసం ఏడు ఎనిమిది గంటలైనా నిద్రపోవాలి.. అలా అని.. అర్ధరాత్రి దాటాక పడుకోని.. ఎప్పుడో పదకొండు గంటలకు లేస్తా అంటే కదరదు.. రాత్రుళ్లు చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. సుదీర్ఘ ప‌ని గంట‌లు, ఆర్థిక ఇబ్బందులు, దాంప‌త్య స‌మ‌స్య‌లు ఇవి అన్నీ మాన‌సికి ఒత్తిళ్ల‌ను పెంచే అంశాలు.. వీటితో పాటు.. గాడి త‌ప్పిన ఆహారపు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, అనారోగ్య స‌మ‌స్య‌లు, మాన‌సిక ఆందోళ‌న‌లు ఇవి అన్నీ నిద్ర‌లేమికి దారి తీస్తున్న అంశాలు. రాత్రి ఎంత నిద్రించినా కూడా మ‌ధ్యాహ్న వేళ చిన్న పాటి కునుకు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. హాయిగా మ‌ధ్యాహ్నం ఒక గంట పాటు నిద్రపోతే చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత కానీ తీరిక దొరికిన‌ప్పుడు కానీ ఒక కునుకు తీస్తుంటారు.. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీరం పున‌రుత్తేజం అవుతుంది. ఇలా మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల మాన‌సిక‌, శారీర‌కప‌ర‌మైన ఒత్తిళ్లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. తాజాగా జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం మ‌ధ్యాహ్నం చిన్న కునుకు తీయ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని తేలింది. మ‌ధ్యాహ్నం పూట కొద్ది సేపు నిద్రించ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి. చాలా మంది మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదంటారు.. మీరు ఏంట్రా ఇలా అంటున్నారు అనుకుంటున్నారా..? ఇక్కడ ఓ లాజిక్‌ ఉంది..

రాత్రి ఆల‌స్యంగా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల క‌లిగే ఒత్తిడిని మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో 30 నిమిషాల పాటు నిద్ర‌పోవ‌డం వ‌ల్ల ఆ త‌రువాత ప‌నిని ఉత్సాహంగా చేస్తారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటేంటే మ‌గ వారితో పోలిస్తే ఆడ‌వారిలో మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు కొద్దిగా త‌క్కువ‌గా ఉంటాయి. మ‌ధ్యాహ్నం నిద్రించ‌డం వ‌ల్ల చురుకుద‌నాన్ని, ఏకాగ్ర‌త‌ను పెంచుకోవ‌చ్చు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర 30 నిమిషాలు దాటితే మాత్రం అది ప్ర‌మాదంగా మారుతుంది. మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌రువాత 30 నిమిషాల కంటే ఎక్కువ‌గా నిద్ర‌పోయిన వారి శ‌రీరంలో జీవ‌క్రియ రేటు దెబ్బ‌తింటుందని తేలింది.

జీవ‌క్రియ దెబ్బ‌తిన‌డం వ‌ల్ల పొట్ట‌, న‌డుము ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుపోవ‌డం, ర‌క్త‌పోటు అధికంగా పెర‌గ‌డం, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయ‌ని తేలింది. అంతేకాకుండా దీని ద్వారా గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు పోయే ప్ర‌మాదం ఉంటుంద‌ట‌.

అయితే మ‌ధ్యాహ్నం 30 నిమిషాల కంటే త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌మాదం ఏమీ లేదు. మ‌న‌లో చాలా మంది ఉత్తేజంగా ఉండ‌డానికి కాఫీని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. కాఫీని తాగ‌డానికి బ‌దులుగా చిన్న కునుకు తీయ‌డం మంచిది. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో 30 నిమిషాలు నిద్రించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టైమ్‌ ఉంటే పడుకోండి. కానీ ఎక్కువసేపు వద్దే..!

Read more RELATED
Recommended to you

Latest news