గాజు సీసాలో నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా ..!

-

చాలమంది వాటర్ ని స్టీల్ గ్లాస్ లోనే లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లోనే తాగుతుంటారు. గాజు సీసాలు లేదా గాజు గ్లాసులలో నీరు తాగేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ గాజు గ్లాసులో నీరు తాగటం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట మీకు తెలుసా. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ప్లాస్టిక్‌ బాటిల్‌ లేదా గ్లాసుల్లో నీరు తాగినప్పుడు ఆ నీరు రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఒక రకమైన వాసన అనుభూతి కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్‌లో హానికరమైన కెమికల్స్‌ ఉంటాయి కాబట్టి. ఇది నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, గాజు సీసా లేదా గ్లాసుల్లో నీరు తాగడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. అలాగే వాసన, రుచిలో ఎటువంటి మార్పు ఉండదు.

గాజు బాటిల్‌ లేదా గ్లాసులో ఉన్న నీరు రోజంతా తాజాగా ఉంటుంది. అదేవిధంగా ఆ నీరు స్వచ్ఛమైందో కాదో సులభంగా తెలిసిపోతుంది. గాజు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్ల నీటిలో ఏమైనా ధూళి ఉంటే సులభంగా కనిపిస్తుంది.

ప్లాస్టిక్, స్టీలు గ్లాసుల్లో సీసాల్లో నీటిని ఉంచడం సర్వసాధారణం. దీని టెంపరేచర్‌ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఆ నీరు ఆరోగ్యానికి మంచిది కాదు. నీటిని గాజు పాత్రలో లేదా సీసాలో ఉంచినప్పుడు ఇటువంటివి జరగవు. ఎందుకంటే గాజు సీసాలు వాటర్‌ టెంపరేచర్‌ను ఎక్కువసేపు చల్లగా లేదా వేడిగా ఉంచగలవు. మీరు నీటిని మాత్రమే కాకుండా ఏదైన ఇతర ఆహార పదార్థాలను కూడా గాజు సీసాల్లో స్టోర్‌ చేసుకోవచ్చు.

గాజు సీసాలను కారీ చేయటం కాస్త కష్ణమైన పనే..అలా అని సాధ్యమైనది మాత్రం కాదు కదా..ఇప్పుడు మార్కెట్ లోకి గాజు సీసాలతో పాటు ప్రొటెక్టర్ కూడా వస్తున్నాయి. ఓ సారి ట్రై చేసి చూడండి. ఖరీదు మామూలు వాటికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ, మన ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా..!
2 Attachments

Read more RELATED
Recommended to you

Latest news