బ్యాంకాక్ పేరు వినని వారుండరూ.. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ నగరం ఎంతో అందమైనది. ఇక్కడి ప్రాంతాలకు ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, తదితరులు వెకేషన్లకు వెళ్తుంటాయి. బ్యాంకాక్ పేరును పలకడానికి హుందాగా.. ఎంతో రిచ్‌గా అనిపిస్తుంది. కానీ, దీని పేరు తెలిస్తే అందరూ షాక్‌కి గురవుతారు. బ్యాంకాక్ అసలు పేరు.. ‘‘ క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటాచా థాని బురి రోమ్ ఉడోమ్ రటాచ నివెట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్ హిట్ సఖ తాట్టియా విట్సనుకమ్ ప్రసిట్’’. పాలి, సంస్కృతం వంటి భాషల పదాలతో బ్యాంకాక్‌కు ఈ పేరు పెట్టారు.
ఇంత పెద్దటి పేరుకు తెలుగులో అర్థం.. ‘‘ దేవదూతల నగరం, అమరత్వం పొందిన నగరం, తొమ్మిది రత్నాల అద్భుత నగరం, చక్రవర్తి సింహాసనం, రాజభవంతుల నగరం, మానవరూపంలో అవతరించిన దేవతల ఇల్లు, ఇంద్రుడి ఆదేశాలతో విశ్వకర్మ నిర్మించిన నగరం’’ అని అప్పటి బ్యాంకాక్ మహారాజు కింగ్ మాంగ్ కుట్ ఈ పేరును పెట్టారు. అత్యంత పొడువైన పేరును కలిగిన నగరంగా బ్యాంకాక్ ఇటీవల గిన్నిస్ బుక్‌లో కూడా చోటు సంపాదించుకుంది. కాగా, అన్ని దేశాలు ఈ నగరాన్ని బ్యాంకాక్‌గా పిలుస్తున్నా.. ఇక్కడి స్థానికులు మాత్రం ఆ పొడవు పేరును కుదించి ‘‘క్రుంగ్ థెప్ మహా నిఖోన్’’ లేదా ‘‘క్రుంగ్ థెప్’’ అని పిలుస్తుంటారు.
అయితే 15వ శతాబ్దంలో బ్యాంకాక్‌ను ఆయుత్తయ రాజులు పల్లెటూరుగా ఉన్న ప్రాంతాన్ని నగరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అప్పటి నుంచి ఆయా రాజులు ప్రధాన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. 1782లో కింగ్ రామ-1 బ్యాంకాక్‌ను రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన హయాంలో బ్యాంకాక్‌ను ‘‘క్రుంగ్ థెప్ తవరవాడి సి ఆయుత్తయ అని పిలిచేవారు. ఇప్పటికీ అంతర్జాతీయ ఒప్పందాల్లో పాత పేరుతోనే బ్యాంకాక్‌ను పిలుస్తారు.