నోబెల్ బహుమతి.. ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడే దాన్ని సాధించడంలో గొప్ప కృషి చేసిన వారికి అందిస్తారు. భౌతికశాస్త్రం, వైద్యం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం మొదలగు అంశాల వారిగా బహుమతులు అందజేస్తారు. అసలు నోబెల్ బహుమతి స్థాపన వెనక ఉన్న చిన్న కారణం చాలామందికి తెలియదు. నోబెల్ బహుమతి స్థాపించిన ఆల్ఫ్రెడ్ నోబెల్, డైనమైట్ ను కనిపెట్టాడన్న సంగతి తెలిసిందే. ఈ డైనమైట్ తో ఒకేసారి వేలమంది ప్రాణాలు తీయవచ్చు. అలాగే దాని సానుకూల ఉపయోగంతో ఎన్నీ ఆవిష్కరణలు సాధించవచ్చు.
డైనమైట్ ను కనుక్కున్న ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒకసారి ఇంట్లో కూర్చును పేపర్ చదువుతున్నాడు. ఆ పేపర్లో ఒక వార్త ఆయన్ను కలచివేసింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడని ఆ వార్త సారాంశం. బ్రతికి ఉన్న నోబెల్, చనిపోయినట్లు వార్త రావడంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అంతే కాదు ఆ వార్తలో ఉన్న సారాంశంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ కనిపెట్టిన డైనమైట్ కారణంగా వేల మందిని ఒకేసారి చంపవచ్చని రాసారు. దాంతో ఆల్ఫ్రెడ్ నోబెల్ కి షాక్ తగిలినట్లయింది.
తన ఆవిష్కరణను ప్రపంచం ఇల్లా గుర్తుపెట్టుకుంటుందన్న ఆలోచన తనకే అసహ్యం వేసింది. వెంటనే ఏదో ఒకటి చేయాలని భావించాడు. అప్పుడే నోబెల్ బహుమతి ఆలోచన వచ్చింది. మానవాళి మనుగడ కోసం, భవిష్యత్తు కోసం, మానవాళికి ఉపయోగపడే ఏ ఆవిష్కరణ చేసిన వారికైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అలా మొదలైందే నోబెల్ బహుమతి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఈ బహుమతి మొదలవ్వడం వెనక చిన్న న్యూస్ పేపర్ కథనం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. డేర్ టూ డూ మోటివేషన్ ఆధారంగా.