సాధారణంగా ప్రస్తుత రోజుల్లో అంతా ప్లాస్టిక్ మయం. ఏది తినాలన్నా లేదా తాగాలన్నా ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పూర్వ కాలములో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడే వారు. ఆయుర్వేదం ప్రకారం రాగిపాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగికి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు. కాబట్టి ఇందులో ఉన్న పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
రాగి చెంబులో నీళ్ళు నిలువ చేసి పరకడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. రాగి పాత్రలలో వండిన వంటలను సేవించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పని చేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు శక్తివంతంగా తయారవుతుంది. రాగి పాత్రలను నిత్యం ఉపయోగంచడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల ఊబకాయం, మలబద్దకం, గుండెపోటు వంటి సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. రాగి కడియం ధరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి బి.పి, కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది. ప్రతి రోజూ ఉదయం రెగ్యులర్ గా రాగిపాత్రలోని నీటి త్రాగడం వల్ల మొటిమలు లేని ఒక స్పష్టమైన చర్మంను పొందవచ్చు. అదే విధంగా చిన్న వయసులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, వయస్సు పెరిగినట్లు కనిపించడం వంటి సమస్యలను కూడా దరిచేరకుండా సహాయ పడుతుంది.