ఇంట్లో గులాబీ మొక్కలను పెంచడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

-

శాస్త్రాల ప్రకారం ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదని అంటారు. ఆ చెట్టు పెరిగే కొద్ది ఇంట్లో కష్టాలు కూడా పెరుగుతాయని అంటున్నారు.. అయితే అలంకరణ, అందం కోసం ఉపయోగించే గులాబి, రోజా చెట్లకు కూడా ముళ్ళు ఉంటాయి. మరి వాటిని పెంచుకోవడం వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా.. అసలు గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం మంచిదా..కాదా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదైనా పండుగ వచ్చిన, ఫంక్షన్ ఉన్నా, ఇంకేదైనా స్పెషల్ డే ఉన్న కూడా గులాబిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.అమ్మాయిలు అందానికి వాడే ఈ మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.అయితే ఇంట్లో గులాబీ చెట్టు ఉండటం మంచిదంటున్నారు పండితులు. మన ఇంట్లో ఈ చెట్టు పెట్టుకోవడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు, ఆనందంగా ఉంటారంట. అయితే ఈ గులాబీ మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఉంచినట్లయితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నైరుతి దిక్కున గులాబీ మొక్కను ఉంచడం మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు.మనం నివసించే ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటే మంచిదట..వాటి పరిమళాల తో మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు దైవ శక్తీ కూడా ఎక్కువగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.నివాసం ఉండే ప్లేస్ కు దక్షిణం వైపు ఎర్రటి పూలు ఉంటే ఆ ఇంట్లో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి..మీరు ఉండే ప్రాంతంలో దక్షిణ దిశ లో ఖాళీ స్థలం ఉంటే గులాబీ మొక్కలను పెంచడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news