ఇండియాలోనే హైయెస్ట్ పారితోషికం అందుకుంటున్న నటుడు ఎవరో తెలుసా..?

-

ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు పారితోషకం పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఒక హిట్ సినిమా పెడితే చాలు మీడియం రేంజ్ హీరోలు కూడా కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది సూపర్ స్టార్ మాత్రం ఎందుకు అంత పారితోషకం తీసుకోవట్లేదు..ఇంకా నిర్మాతలు పిలిచి మరి వీరికి కళ్లు చెదిరే ఇస్తున్నారట. మరి ఆ విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..Rajinikanth is yet to decide on his next film; reports on 'Thalaivar 169' are false! | Tamil Movie News - Times of India

ప్రతి ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోలు ఇప్పుడు రూ.50 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్న విషయం తెలిసిందే. తక్కువలో తక్కువ కనీసం రూ. 40 కోట్లు అయినా సరే తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇంకా ఎక్కువ క్రేజ్ వున్న ప్రభాస్ , విజయ్ లాంటి హీరోలు ఏకంగా వంద కోట్లు అందుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. మరి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. మన ఇండియా లోని టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఈయనే ప్రథమ స్థానం లో ఉన్నారట.. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్. ఈయనకు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తమిళనాడులో అయితే ఈయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అంటే ముందు నుండే భారీ క్రేజ్ ఉంటుంది .థియేటర్ల దగ్గర ఫాన్స్ సందడి మామూలుగా ఉండదని చెప్పాలి.rajinikanth: Superstar Rajinikanth's next film titled 'Jailer', to be helmed by 'Beast' director Nelson Dilipkumar - The Economic Times

ఇక ఈయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్ల దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. మరి రెమ్యునరేషన్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది అనే ఒక వార్త వైరల్ అవుతోంది. ఇక ఈయన ఇండియాలోనే హైయెస్ట్ పారితోషకం తీసుకుంటున్నారు అంటూ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కి కూడా సోషల్ మీడియాలో బాగా బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 140 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇది ఇప్పటి వరకు ఇండియన్ హీరోలలో హైయెస్ట్ పారితోషికం అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news