వినాయకుడి పూజకు తులసి దళాలను ఎందుకు వాడకూడదో తెలుసా?

-

తులసి ఆకులు చాలా పవిత్రమైనవి అందుకే ప్రతి దేవుడి గుడిలో తులసి మాలలతో అలంకరణ చేస్తారు..అయితే వినాయకుడికి మాత్రం తులసిని వాడరు ఎందుకో తెలుసా.. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది.. అస్సలు ఎందుకు వాడారో, పురాణాలు ఎం చెబుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

మనం ఎటువంటి పూజలను తలపెట్టిన కూడా ముందుగా వినాయకుడుకు పూజలు చేస్తాము.. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. ఆయన్ని స్మరించనిదే ఏ పని తలపెట్టరు..బుధవారం రోజున వినాయక పూజ చేస్తే మంచి ఫలితాల లభిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. కార్యభంగం, జాప్యం లేకుండా ఉంటుందని నమ్మకం, ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది. వినాయక పూజలో రకరకాల మోదకాలు సమర్పిస్తారు. అంతే కాదు వీటితోపాటు కుంకుమ, అక్షతలు, దర్భలు, పువ్వలు, సుగంధ ద్రవ్యాలు, సింధూరం వంటివన్నీ గణేష పూజలో వాడుతారు. కానీ తులసిని మాత్రం గణేష పూజకు ఉపయోగించరు..ఎందుకంటే..

తులసీ దేవి అతడి అందమైన రూపానికి ఆకర్శితురాలవుతుంది. గణేషుని వివాహమాడాలనే కోరిక మనసులో కలిగింది. ఆమె మనసులోని ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయ్యింది. తులసి వల్ల తన తపోభంగం జరిగిందని తెలుసుకుని తులసికి తాను బ్రహ్మచారినని, ఆమె కోరికను తిరస్కరించాడు. ఆ తిరస్కారానికి ఆమెకు కోపం వచ్చింది. దీర్ఘకాలం పాటు బ్రహ్మచారిగా ఉండిపొమ్మని శపిస్తుంది. అకారణంగా శాపానికి లోనైన వినాయకుడికి కూడా కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని, అతడి చరలో ఉండిపోతావని శపిస్తాడు… ఇక తులసి క్షమించమని వేడుకుంటుంది. కానీ వినాయకుడు మాట వెనక్కి తీసుకోడు..

గణేష శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది. అతడికి కృష్ణ కవచం ఉందనే గర్వంతో లోక కంటకుడిగా మారి అందరిని బాధిస్తుంటాడు. తులసి పాతివ్రత్య మహత్మ్యం వల్ల అతడిని సంహరించడం విష్ణుమూర్తికి దుర్లభం అవుతుంది. వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి.. మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్య భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకుని శిరస్సులేకుండా జీవించమని తులసి శపిస్తుంది.. అందుకే వీరిద్దరి మధ్య వైరం ఉంటుంది అందుకే వినాయక చవితి మినహాయించి ఎప్పుడూ తులసి కనిపించదు.. అదన్నమాట అసలు మ్యాటర్..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version