Beast: ‘డాక్టర్’తో ‘బీస్ట్’కు పోలికలు..విజయ్ మూవీ వర్కవుట్ కాలేదా!

-

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. బుధవారం విడుదలైన చిత్రం మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా అనుకున్న స్థాయిలో లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు విజయ్ బీస్ట్ డిజాస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. అయితే, తమిళనాట మాత్రం పిక్చర్ ను అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

తమిళ్ తో పాటు ఇతర భాషల్లో విడుదలైన చిత్రం.. తెలుగులోనూ విడుదలైంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఫిల్మ్ ను డిస్ట్రిబ్యూట్ చేశారు. కాగా, ఈ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ముందు చిత్రం ‘డాక్టర్’తో పోలుస్తూ కొందరు #Doctor హ్యాష్ ట్యాగ్ డాక్టర్ అని ట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు హ్యష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఫిల్మ్ క్రిటిక్ రమేశ్ బాలతో పాటు పలువురు విమర్శకులు , నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ‘డాక్టర్’ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ ‘బీస్ట్’లో ఉన్నారని, కానీ, ఇందులో కామెడీ లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ థియేటర్స్ లో వర్కవుట్ అయి, టీవీల్లో ఫెయిల్ అయిందంటున్నారు.

అలాగే ‘బీస్ట్’ థియేటర్స్ లో ఫెయిల్ అయినా టీవీల్లో వర్కవుట్ అవుతుందని జోస్యం చెప్తున్నారు. మొత్తంగా నెల్సన్-విజయ్ కాంబోలో వచ్చిన ‘బీస్ట్’ ఫిల్మ్ ను నెల్సన్ ముందు చిత్రం ‘డాక్టర్’తో కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు. నెల్సన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన ‘డాక్టర్’ పిక్చర్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది.

Read more RELATED
Recommended to you

Latest news