Breaking : కరోనా కేసులపై కీలక విషయాలు వెల్లడి

-

ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టి కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో కూడా రోజు రోజూకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిచింగే విషయం. అయితే తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగానే నమోదవుతున్న వేళ వైద్యులు ఊరట కలిగించే విషయం వెల్లడించారు. కొత్త ఒమిక్రాన్ వేరియంట్ల వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య మాత్రం పెరగడం లేదని, వైరస్ వల్ల మరణాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయన్నారు. అదే సమయంలో వైరస్ బారిన పడి వాళ్లు మూడు, నాలుగు రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటున్నారని చెబుతున్నారు వైద్యులు.

ఈ నెల 1 నుంచి 9వ తేదీల మధ్య రాష్ట్రంలో కరోనా కేసులు 481 నుంచి 5,189కి పెరిగాయి. కానీ, ఈ తొమ్మిది రోజుల్లో వైరస్ వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. గత మూడు వేవ్ లకు పూర్తి భిన్నంగా ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. వైరస్ బాధితులు ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారని, కరోనా రెండు, మూడో వేవ్స్ లో రాష్ట్రంలో 80 వేల మందికి పైగా కరోనా రోగులకు చికిత్స అందించిన గాంధీ ఆసుపత్రిలో ఈ మధ్య ఒక్కరు కూడా క్రిటికల్ కేర్ లో చికిత్స తీసుకోవాల్సిన అవసరం రాలేదని వైద్యులు వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version