పిల్లలకు డైపర్‌ వల్ల చర్మం కందిపోతుందా..? ఈ చిట్కాలు పాటించండి..!!

-

చిన్నపిల్లలను పెంచడం అంటే.. ఎంతో ఓర్పు ఉండాలి. వాళ్లకు వచ్చిన ప్రతీ సమస్యను అర్థంచేసుకోగలగాలి.. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్లు పక్కనే ఉంటారు. వాళ్లకు అయితే అవగాహన ఉంటుంది.. అన్నీ సక్రమంగా చేయగలుగుతారు.. కానీ ఈరోజుల్లో అందరూ వర్కింగ్‌ ఉమెన్స్‌..నెలలు నిండేవరకూ ఆఫీసులకు లీవ్‌ పెట్టడం లేదు. డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని నెలలు మాత్రమే రెస్ట్ తీసుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉంటే మీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి.. ముఖ్యంగా పిల్లల డైపర్‌ మార్చినప్పుడు మీరు చూసే ఉంటారు..వారి చర్మం కందిపోయి ఎర్రగా అయిపోతుంది. రాషెస్‌ వస్తాయి. వీటి వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇక జాగ్రత్తలు అనగానే.. మెడికల్‌ షాప్‌కు వెళ్లి ఏదో ఒక క్రీమ్‌ తెచ్చి రాసేయడం కాదు.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరి..! అవేంటంటే..

ఆలివ్ ఆయిల్-
ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చర్మంపై ఎలర్జీ ఉంటే చుక్క నూనె పోసి ఆ ప్రదేశంలో రాస్తే అలర్జీ తగ్గుతుంది.

పెట్రోలియం జెల్లీ-

ఇది చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.. ఇది జెర్మ్స్ ఉత్పత్తిని కూడా నిరోధిస్తుంది. దుష్ప్రభావాలను పూర్తిగా తొలగిస్తుంది. డైపర్ చేయడానికి ముందు పెట్రోలియం జెల్లీని వర్తించండి.

మొక్కజొన్న-

శిశువు డైపర్ తొలగించిన తర్వాత, ఆ ప్రదేశం తడిగా ఉంటుంది. ఆ తేమ శిశువులో చర్మ అలెర్జీకి దారితీస్తుంది.. ఆ ప్రదేశంలో మొక్కజొన్న పిండిని వేస్తే.. ఆ తడిని పీల్చుకుంటింది.. సున్నితమైన చర్మం కందకుండా ఎలాంటి అలర్జీలు రాకుండా ఉంటాయి.

కొబ్బరి నూనె-

ఇదైతే ఏళ్లతరబడి అందరూ వాడే చిట్కానే.. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మం తేమను కూడా నిలుపుకుంటుంది. కొబ్బరి నూనెను డైపర్ ప్రాంతంలో అప్లై చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

యాపిల్ సైడర్ వెనిగర్-

యాపిల్ సైడర్ వెనిగర్‌కు క్రిములను చంపే శక్తి ఉంది. ఒక కప్పు నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి డైపర్ ప్రాంతాన్ని కడగాలి. ఇలా చేస్తే ఎలాంటి అలెర్జీ ఉండదు..

తల్లి పాలు-

అవను తల్లిపాలకు ఇన్ఫెక్షన్స్స్‌ తగ్గించే శక్తి ఉంది.. శువులలో డైపర్ దుద్దర్లు తొలగించే శక్తి తల్లి పాలకు ఉందని చాలా అధ్యయనాలు నిర్ధారించాయి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రభావిత ప్రాంతంపై కొద్దిగా తల్లి పాలను రుద్దడం వల్ల ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది.
తేనె- తేనె ఒక అద్భుతమైన ఔషధం.. యాంటిసెప్టిక్. డైపర్ ప్రభావిత ప్రాంతంలో తేనెను పూయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.. ఎదిగే పిల్లలకు తేనె బాగా హెల్ప్‌ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version