ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు గురించి ఏపీ రాజకీయాల్లో అనేక రకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే… ఇంతకాలం మంత్రివర్గంలో మార్పులు గురించి క్లారిటీ ఇవ్వని జగన్…తాజాగా మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు… ఈ జూన్ లో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటిదాకా మంత్రులుగా పదవులు చేపట్టినవారిలో కొందరికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులు అప్పగించి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పుకొచ్చారు.
అంటే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని మాత్రం జగన్ చెప్పేశారు..కాకపోతే జగన్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు.. కొన్ని కారణాలతోనూ.. కులాల సమతుల్యత నేపథ్యంలోనూ కొందరిని కొనసాగించే వీలుందని చెప్పుకొచ్చారు…అంటే అందరినీ మంత్రివర్గం నుంచి తప్పించడం సాధ్యం కాదని మాత్రం అర్ధమవుతుంది..అంటే కొంతమందిని మాత్రం మంత్రివర్గంలో కొనసాగించడం ఖాయమని అర్ధమవుతుంది. అయితే జగన్ చెప్పిన కులాల సమతుల్యత అనే పాయింట్ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానికి లక్కీ ఛాన్స్ అవుతుంది.
ఆ విషయం మాట్లాడుకునే ముందు కొడాలి నానిని మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..ఎందుకంటే ఈయన …చంద్రబాబు, లోకేష్ లపై ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో అందరికీ తెలిసిందే…ఈయన జగన్ ప్రభుత్వానికి పెద్ద సేఫ్టీ వాల్ మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఈయన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది..ఇక కులాల సమీకరణ కూడా నానికి కలిసొస్తుంది.
కమ్మ వర్గంలో ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు…కానీ ఎవరు కూడా కొడాలి నాని మాదిరిగా ఫైర్ బ్రాండ్ నాయకులు కాదు..అంతా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారే…అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. కాబట్టి కొడాలి నానినే మంత్రివర్గంలో కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అయితే జగన్ సన్నిహితుడు తలశిల రఘురాం ఎమ్మెల్సీగా ఉన్నారు..ఈయన కమ్మ వర్గానికే చెందిన నేత…పైగా కృష్ణా జిల్లా నేత. మరి ఈయనకు ఏమన్నా జగన్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే కొడాలిని పక్కన పెట్టాలి. కానీ అంత దూరం జగన్ ఆలోచన చేయకపోవచ్చని, కొడాలిని ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగిస్తారని తెలుస్తోంది.