ఏపీ పోలీసులకు అక్రమ మద్యం చుక్కలు చూపిస్తుందా…?

-

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సరిహద్దులో పోలీసులు ఎన్ని విధాలుగా భద్రతను ఏర్పాటు చేసిన సరే అక్రమ మద్యం మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇక రాజకీయ నాయకులు అండ ఉండటం సరిహద్దుల్లో ఉన్న పోలీసుల నుంచి సహాయ సహకారాలు ఉండటంతో ఇప్పుడు భారీగా అక్రమ మద్యం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా నుంచి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది.

ఇది కట్టడి చేయడం పోలీసులు కూడా పెద్ద సవాల్ గా మారింది. తాజాగా కృష్ణా జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 1.5 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, ఒక కారు ని అదే విధంగా ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తెలంగాణ నుంచి ఎక్కువగా రవాణా అక్రమంగా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news