తిరుచెందూర్ విభూతికి అంత శక్తి ఉందా?.. అసలు రహస్యాలు ఇవే..!

-

దేవుడు ఉన్నాడు అని కొన్ని సంఘటనలను చూస్తే నమ్మాలనిపిస్తుంది..ఇప్పుడు మనం చెప్పుకోబోయే విభూతికి ఉన్న మహిమలు వింటే నోటమాటరాదు.. తిరుచెందూర్ లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం ఎవరి సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర, సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము..అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం..

ఈ ఆలయం తమిళనాడు లో ఈ క్షేత్రం తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో.. ‎సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది..

స్వామి వారికి అభిషేకం చేసిన ‎విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి…పంచామృతాలతో పాటుగా సుబ్రహ్మణ్యునికి విభూతితో అభిషేకం చేస్తారు. విభూతి జ్ఞానానికి ప్రతీక. స్వామి వారికి అభిషేకం చేసిన విభూతిని, ఒక పన్నీరు చెట్టు ఆకులో మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు..ఎంతో మందికి అనుభవములోకి వచ్చాయి స్వామి వారి లీలలు. నమ్మిన వాడికి నమ్మినంత అన్నారు పెద్దలు. ఆ స్వామి లీలలు ఎల్లలు పాకింది..అందుకే ప్రతినెల భక్తుల రద్దీ పెరుగుతుంది.. మీకు వీలైతే ఒకసారి సందర్శించి పునీతులు కండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version